తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
నిన్న ఉదయం నుంచే తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి లోకనాథం నివాసంతో పాటు ఆయన...