మదనపల్లె: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, ఉద్యోగి మృతి చెందిన సందర్భంలో రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని...