Bharat Aawaz
రెడ్ క్రాస్ సేవలకు గుర్తింపు.. ఏడుగురు కలెక్టర్లకు స్వర్ణ పతకాలు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏడుగురు జిల్లా కలెక్టర్లు ప్రతిష్ఠాత్మక గవర్నర్ స్వర్ణ పతకాలకు ఎంపికయ్యారు. తమ జిల్లాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) ద్వారా అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్ చేతుల మీదుగా ఈ పతకాలను అందజేయనున్నారు....
185 Views