నిమ్మనపల్లి: మండలంలోని చల్లావారిపల్లి గ్రామంలో చమరకాకి ఒడ్డున కొలువైన అక్కదేవతల ఆలయంలో ‘పచ్చ పోసే’ మహోత్సవాన్ని గ్రామస్థులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.
సంప్రదాయ ఆచార వ్యవహారాలతో సాగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు....