కాకినాడ బీచ్‌లో యువకుల గల్లంతు.. గాలింపు ముమ్మరం చేయాలన్న పవన్ కల్యాణ్.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు యువకుల్లో ఇద్దరు భారీ అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు....