కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించుకుందామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ...