చింతూరు సబ్‌డివిజన్ పరిధిలో నిలిచిపోయిన వాహనాల ఫిట్నెస్ పరీక్షలను వెంటనే పునరుద్ధరించాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆటో యూనియన్ సభ్యులు ఎంవిఐ చల్లారావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ... చింతూరులో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకపోవడంతో నాలుగు మండలాలకు చెందిన ఆటో కార్మికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన...