తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపలి వరకు విస్తరించాయి. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం జారీ చేయాల్సిన సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని...