ఏనుగులు ధ్వంసం చేసిన మొక్కజొన్న పరిశీలన
బొబ్బిలి మండలం శివడవలసలో ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే బేబినాయన ఆదేశాలతో పంటను పరిశీలించి నష్టపరిహారం కోసం అటవీశాఖ అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఏవో చెప్పారు. నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. #Rajesh 
0 Comments 0 Shares 150 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com