అన్నమయ్య జిల్లాలోని చేనేత కార్మికులందరికీ ‘నేతన్న సేవ’ పథకం వర్తింపజేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత ఐక్య వేదిక జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. సంఘం జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీలం వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోడెం నాగరాజు ఆధ్వర్యంలో సమర్పించిన వినతిపత్రంలో,...