కోసిగి మండలంలో ఉన్న సంక్షేమ బాలుర వసతిగృహం (ఇంటిగ్రేటెడ్) హాస్టల్‌ను ఎత్తివేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రాజు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు నిలయంగా ఉన్న కోసిగి...