మదనపల్లె, జూలై 26: ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, మాస్టర్ మురళి నేతృత్వంలో ఆదివారం ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. కదిరి రోడ్డులోని లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బెంగళూరు బస్ స్టాండ్ వరకు సాగింది.
ర్యాలీలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అకాడమీ సభ్యులు పెద్ద ఎత్తున...