ఏపీ అస్త్రం' ఆవిష్కరణ.. భవిష్యత్ పోలీసింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీసులు రూపొందించిన 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో మూడు రోజుల పాటు జరిగిన 'ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్' కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు....