జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.
మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్ ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు టేకుమట్ల గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...