ఎట్టకేలకు చింతూరులో దంచి కొడుతున్న వర్షం!
పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఈరోజు సాయంకాలం 3 గంటలకి వర్షం ప్రారంభమైంది. గత నెల 20, 24, తేదీల్లో కురిసిన జల్లులు మినహా ఎల్నినో ప్రభావంతో మరల ఈరోజు వర్షం కురుస్తుంది. గత నెలలో వర్షం లేక రైతులు వరి ఇతరత్రా నారుమడులు సిద్ధం చేసుకోలేకపోయారు. ఈరోజు కురుస్తున్న వర్షంతో రైతులు నారుమడులు సిద్ధం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కొందరు రైతులు తెలిపారు. 
0 Comments 0 Shares 35 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com