బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సేవాకైంకర్యాలు వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది....