గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన వాతావరణ వ్యవస్థ (అల్పపీడన ద్రోణి) కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
...