కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా..సాకేత్ శర్మ
కాలేశ్వరం పేరు వినగానే కాస్ట్–బెనిఫిట్ రేషియో అంటూ కారుకూతలు కూసే వాళ్లను నేను అడుగుతున్నా, కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా? మీ ఎక్సెల్ షీట్లు రైతు పొలాలకు నీళ్లు ఇస్తాయా? మీ లెక్కల పుస్తకాలు ఎండిన చెరువులు నింపుతాయా? మీ కాస్ట్–బెనిఫిట్ పట్టికలు వలసపోయిన కుటుంబాలను తిరిగి ఊళ్లకు తీసుకొస్తాయా? మాటలు చాలా సులువు కానీ తెలంగాణ బతుకును మోసింది మాటలు...