నిమ్మనపల్లి మండలం బాలేపల్లిలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, దగ్గుతో పాటు సాయంత్రం జ్వరం, కఫంతో కూడిన దగ్గు, రక్తంతో దగ్గు, బరువు తగ్గడం, అలసట, రాత్రిళ్లు చెమటలు పట్టడం, ఛాతినొప్పి, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపించినా టీబీగా అనుమానించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ, చికిత్స ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిగా...