చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!
చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన అఖిల్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొల్లూరు జలపాతాన్ని సందర్శించడానికి వచ్చాడు. అందరూ కలిసి జలపాతం అందాలను ఆస్వాదిస్తూ, నీటిలో కేరింతలు కొడుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. అఖిల్ ప్రమాదవశాత్తు జలపాతంలోని లోతైన నీటి గుండంలో పడి...