చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయింది. కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకముందే ఈ భవనం ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ పెచ్చులు ఊడిపోతుండటం, వర్షం వస్తే నీరంతా లోపలికి కారుతుండటంతో ఈ కేంద్రం ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.భవనానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో...