లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA.
మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం సహాయ నిధి (CMRF) కింద రూ. 4,10,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా చెక్కులను అందజేశారు. తమ ఇంటి వద్దకే వచ్చి సాయం అందించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
0 Comments 0 Shares 122 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com