"భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో ‘మీ సురక్ష’ కమ్యూనిటీ పోలీసింగ్ అవగాహన కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.
స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బేగంపేట ఏసీపీతో పాటు సెక్టార్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), పోలీస్ సిబ్బంది...