మదనపల్లెలో ట్రాక్టర్ ఢీ.. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజశేఖర్ (30) తీవ్రంగా గాయపడ్డాడు. కోటవారిపల్లికి చెందిన రాజశేఖర్ తన ఆటోలో మదనపల్లెకు ప్రయాణికులను తరలిస్తుండగా, దండువారిపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0 Comments 0 Shares 41 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com