గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గొల్లపల్లిలో ఉన్న ఆలయం, బైపాస్ రోడ్డులో ఉన్న ఆలయం వద్ద తెల్లవారుజామున నుంచి పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారిని ఎమ్మెల్యే బేబినాయన దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణి చేశారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పూజలకు రావడంతో ఆలయాలు సందడిగా ఉన్నాయి. #Boiena Rajesh
0 Comments 0 Shares 144 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com