"మీసేవా కేంద్రాలపై ఏసీబీ పంజా: అల్వాల్, ఖైరతాబాద్ సహా పలుచోట్ల సోదాలు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) బుధవారం హైదరాబాద్‌లోని పలు మీసేవా కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. అల్వాల్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, మల్లేపల్లి వంటి కీలక ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
పలు మీసేవా కేంద్రాల్లో కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాల జారీ కోసం సిబ్బంది దళారులతో చేతులు కలిపి సామాన్య ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు...