ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఒంగోలులోని తన స్వగృహంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సాహితీలోకంలో విషాదం నెలకొంది.
లక్ష్మీనరసింహారావు సాంఘిక శాస్త్ర, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా మూడున్నర దశాబ్దాల పాటు పనిచేశారు. సంతనూతలపాడు పరిసర ప్రాంతాల్లో నిబద్ధత కలిగిన...