ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, వారిలో నూతనోత్సాహం నింపుతున్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతూ పార్టీ శ్రేణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే సమయంలో, పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత...