సికింద్రాబాద్: బస్తీ వాసుల అభీష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడతామని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
శుక్రవారం రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని జీరా బస్తీ, పరిసర కాలనీలలో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జీరా గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించిన...