ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి బకాయిలను విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.2,950 కోట్లను విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల కోసం ఈ నిధులను కేటాయించగా, వాటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ...