నందవరం మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిమ్మారెడ్డి కుంట చెరువును సందర్శించి కార్యక్రమంపై మాట్లాడారు ఈ కార్యక్రమం మొత్తం 4 దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదట 10 రోజుల్లో పనుల గుర్తింపు, అనంతరం నిధుల మంజూరు, తరువాత 70 రోజుల్లో పనుల అమలు, చివరగా 5 రోజులు రిపోర్టింగ్...