పుంగనూరు నియోజకవర్గ : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన మునిరెడ్డి (40) రెడ్డివారిపల్లి సమీపంలోని రెడ్డివారి చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడు. చెరువు మధ్యలో ఉన్న మొక్కలలో ఇరుక్కుపోవడంతో అతను మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఎంతసేపటికి అతను తిరిగి రాకపోవడంతో, స్థానికులు సాయంత్రం గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 50 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com