తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నా రు"
ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ హైదరాబాదులోనే ఉంటూ స్కూళ్లు నడుపుతూ, ఇల్లు కూడా ఇక్కడే ఉన్నా.. తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నారని, ఇలాగే వ్యాఖ్యలు చేస్తే మరోసారి ఉద్యమం చేసే రోజు వస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొంత మంది ఆంధ్రావాళ్లు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.