మదనపల్లెలో పిచ్చికుక్క వీరంగం–ఇద్దరు చిన్నారులకుతీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామంలో గురువారం పిచ్చికుక్క దాడిలో ఐదేళ్ల కుందన్, రెండేళ్ల దుర్వింత్ రామ్ అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు ఆడుకుంటున్న వీరిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్కను పట్టుకోవాలని, నియంత్రించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. గాయపడిన పిల్లలకు స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.
0 Comments 0 Shares 55 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com