ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీలో 13,222 నివాస, వాణిజ్య భవనాలు నుంచి రూ.6.78 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.5.13కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో నెల్లిమర్ల మొదటి స్థానం, రాజాం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కుళాయి పన్ను రూ.60,69,567 వసూలు అయినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. #RAJESH 
0 Comments 0 Shares 280 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com