ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట మండలానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే, బి. కొత్తకోట సీఐ గోపాలరెడ్డి తమను విడదీసి, యువతిని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించారని బాధితుడు వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ విషయంపై న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు గురువారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు చేశారు.
0 Comments 0 Shares 84 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com