ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో ఆదివారం మంగళగిరిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో ఆస్టర్ రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరానికి తెదేపా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 530 మందికి...