మంగళగిరిలో ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారు. గతేడాది పవిత్ర రంజాన్ మాసంలో చేసిన వాగ్దానాన్ని ఏడాది తిరగకముందే నెరవేర్చి, వారికి కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే... గతేడాది రంజాన్ మాసం సందర్భంగా మంత్రి లోకేశ్ మంగళగిరి బస్టాండ్ సమీపంలో నివసించే షేక్ షహెన్షా నివాసానికి ఆకస్మికంగా వెళ్లారు. అక్కడ...