ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.
ముఖ్యంగా శుక్రవారం (మార్చి 20) దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం...