శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి సేవలో ఇకపై ధర్మవరం పట్టు వస్త్రాలు భాగం కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా 65 వేల పట్టు శాలువాల కొనుగోలుకు టీటీడీ అనుమతులు మంజూరు చేసిందని మంత్రి సవిత వెల్లడించారు....