Bharat Aawaz
హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. #BOIENA RAJESH 
332 Views