రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ (M) గుడివాడకు చెందిన గుడివాడ కిషోర్ (19) తన బైక్ పై కొట్యాడలో ఉన్న తాతగారి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖాసాపేట సమీపంలో గల వంతెన వద్ద బైక్ అదుపు తప్పడంతో గెడ్డలో పడి మునిగి మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ పాపారావు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....
0 Comments 0 Shares 196 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com