గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ హేమంత్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. విధి నిర్వహణ ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన హేమంత్‌ను మదనపల్లి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు #కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 269 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com