Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
    శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కాలనీ గేటు వద్ద ఓ యువకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి గాయపడిన జగదీష్ నాయక్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
    491 Views
  • మదనపల్లిలో పట్టపగలే భారీ చోరీ.
    మదనపల్లెలో శుక్రవారం పట్టపగలే దొంగలు ఓ ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 6 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అపహరించుకుని పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీంతో కలిసి పరిశీలన చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    657 Views
  • బోయకొండలో భక్తుల ఆటో బోల్తా.. ఏడుగురికి తీవ్ర గాయాలు.
    బోయకొండ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తుల ఆటో శుక్రవారం సాయంత్రం కొండపై బోల్తా పడింది. తెనాలి, రేపల్లి, పల్కికోలు, పెరవలి ప్రాంతాల నుంచి కూలి పనుల కోసం కందూరుకు వచ్చిన 13 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మదనపల్లి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
    283 Views
  • మదనపల్లిలో ఘనంగా జాతీయ కుష్ఠ వ్యాధి వ్యతిరేక దినోత్సవం.
    మదనపల్లె జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతీయ కుష్ఠ వ్యాధి వ్యతిరేక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. "వివక్షతను అంతంచేద్దాం, గౌరవాన్ని కాపాడుదాం" అనే నినాదంతో జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు గ్రామ పంచాయతీల్లో స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కుష్ఠు పరీక్షలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
    280 Views
  • Chandrababu Naidu: ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ ..10.30 గంటల సమయానికే 60 శాతం పంపిణీ.
    ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది   గుడిపల్లి మండలం బెగ్గిలపల్లె లో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వేగవంతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి...
    274 Views
  • TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో శ్రీవారి డాలర్ల అమ్మకాలు బంద్.
    నష్టాలు నివారించేందుకు అమ్మకాల్లో మార్పులకు శ్రీకారం రోజువారీ ధరలు, దర్శన టికెట్ ఉన్నవారికే డాలర్లు అమ్మేలా కొత్త విధానం ఒకరికొకటి మాత్రమే, పాన్ కార్డు నిబంధన అమలుకు ప్రణాళిక టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బయట మార్కెట్ ధరలతో పోలిస్తే టీటీడీ...
    268 Views
  • Anagani Satya Prasad: ఏపీలో 22 ఏ భూముల సమస్య పరిష్కారానికి త్వరలో విధాన ప్రకటన: మంత్రి అనగాని.
    రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడి రీసర్వేలో రైతులను భాగస్వామ్యం చేయాలన్న మంత్రి అనగాని 22ఏ భూ సమస్యలపై రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా త్వరలో విధాన ప్రకటన చేయనున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూసమస్యలకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు.    సీసీఎల్‌ఏ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై...
    302 Views
  • APPSC Group 1: ఏపీపీఎస్‌సీ గ్రూప్ - 1 ఫలితాలు విడుదల.
    హైకోర్టు ఆదేశాలతో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులు రిజర్వు చేసిన ఏపీపీఎస్‌సీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి అడ్డంకులు తొలగడంతో నిన్న సాయంత్రం ఏపీపీఎస్‌సీ గ్రూప్‌ -1 అభ్యర్థుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేసింది. క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను రిజర్వు చేయాలని...
    347 Views
  • Tirumala Theft: తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్.
    తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, మండ నవీన్‌  ఈ నెల 28,29 తేదీలలో ఇద్దరు భక్తుల నుంచి నగదు, విలువైన వస్తువులు చోరి చేసిన వైనం బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన టూటౌన్ పోలీసులు తిరుమలలో భక్తులను మాటలతో బురిడి కొట్టించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ శ్రీరాముడు...
    543 Views
  • BITS Pilani: ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ... సీఆర్డీఏతో కీలక ఒప్పందం.
    బిట్స్ పిలానీ ఏర్పాటుకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమికి సంబంధించిన ఒప్పంద ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు అమరావతి క్యాంపస్‌ను మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నామన్న బిట్స్ పిలానీ ప్రతినిధులు రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు...
    284 Views