Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్.

0
183

 

 

Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్

13-02-2026 Fri 13:49 | Andhra

Nara Lokesh Slams YSRCP Walkouts Over Fee Reimbursement

వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయన్న మంత్రి

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి

ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదన్న మంత్రి నారా లోకేశ్

శాసనమండలిలో వైసీపీని నిలదీసిన నిలదీసిన మంత్రి నారా లోకేశ్

 

వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేశ్ అన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే వీటిపై చర్చించేందుకు రావాలని, తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని హితవు పలికారు. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.

 

ముందుగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న కాంటీన్లు మూసివేయబోమని సభలో చెప్పి మాటతప్పారని, ఇప్పుడు వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేవంటూ నీతులు చెబుతున్నారని అన్నారు.

 

దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేవని చెబుతున్నారని, 2020- 2021 ఏడాది క్యూ-4 పెండింగ్ 683.1 కోట్లు, 2023-24 క్యూ-2, క్యూ-3, క్యూ-4 బకాయిలు 1753.98 కోట్లు, 2023-24 ఏడాది గమనిస్తే ఎంటీఎఫ్ ఎరియర్లు సుమారు రూ.895 కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించినట్లు సభ్యులు చెబుతున్నారని, ప్రభుత్వం మారే సమయంలోనూ రూ.645 కోట్ల బకాయిలు చెల్లించలేదని అన్నారు.

 

తాను ఈ విషయాలను పూర్తి ఆధారాలతో చెబుతున్నానని లోకేశ్ అన్నారు. విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు తనకు హక్కు ఉందని స్పష్టం చేశారు.

 

ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ, వైసీపీ హయాంలో రూ.4 వేల కోట్ల బకాయిలు లేవని, రెండు వాయిదాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వం ఇంటర్ విద్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు.

 

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం

 

వైసీపీ వాకౌట్ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. "నిజాలు చేదుగా ఉంటాయి. వైసీపీ సభ్యులు అబద్దాలు చెప్పి బయటకు వెళుతున్నారు. ఇంటర్ విద్యపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70 వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. వైసీపీ ఐదేళ్ల కాలంలో కనీసం పుస్తకాలు, బ్యాగ్స్ ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం రద్దు చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. మేం ఇంటర్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్దరించాం. పుస్తకాలు ఇస్తున్నాం. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్. ఈ తలుపు నుంచి వెళతారు. హాయిగా టీ తాగి ఆ తలుపు నుంచి వస్తారు" అని ఎద్దేవా చేశారు.

 

చిత్తశుద్ధి ఉంటే వైసీపీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సమాధానం ఇస్తున్నామని అన్నారు. సమస్యలు లేవని మేం చెప్పడం లేదన్నారు. వాటిని వినడానికి అలాగే పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

 

పరదాలు కట్టుకుని తాము తిరగడం లేదని మంత్రి లోకేశ్ అన్నారు. ఇప్పుడు అసెంబ్లీకి ముఖ్యమంత్రి వస్తుంటే ప్రజలు నవ్వుతూ చేతులు ఊపుతున్నారని, గత ముఖ్యమంత్రి మాత్రం రోడ్లపై 3వేల మంది పోలీసులను పెట్టేవారని ఎద్దేవా చేశారు. నాడు యుద్ధవాతావరణం ఉండేదని అన్నారు. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా, హాయిగా తిరగగలుగుతున్నారని, ఇదీ తమ చిత్తశుద్ధి అన్నారు. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని, విపక్ష నేతను పిలిపించాలని అన్నారు. వైసీపీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం అయ్యారని విమర్శించారు. ప్రశ్నించే హక్కు తనకు ఉందని, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.
మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్  పానకాల...
By Pagadala Venkateswar 2026-06-25 06:17:48 0 81
Telangana
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
By Sidhu Maroju 2026-01-30 12:03:23 0 404
Telangana
గృహజ్యోతికి దరఖాస్తు చేసుకోవాలి: కడెం ఏఈ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని...
By Mittapelli Saketh 2026-01-10 04:21:05 0 629
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
గురువారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా,...
By Pagadala Venkateswar 2026-01-23 07:33:11 0 248
Andhra Pradesh
Andhra pradesh former minister mudragada padbhanam expired
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం...
By G k Nookala 2026-07-14 15:22:58 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com