Bharat Aawaz

38 పేద కుటుంబాల ఆడబిడ్డలకు చేయూత.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
164
Views

● కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో 38 కుటుంబాలకు ఊరట

అల్వాల్, అక్టోబర్ 31:పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారంగా మారకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

అల్వాల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తహసీల్దార్ రాములుతో కలిసి మొత్తం 38 మంది అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆడపిల్లల వివాహ సమయంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను కొంతమేర తగ్గించడంతో పాటు, నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జేఏసీ సురేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణగిరి, సురేష్, శోభన్ బాబు, భాస్కర్ రెడ్డి, మహేష్, రాజేందర్, అరుణ్, బషీర్, సాజిద్, కన్నా, వీరయ్య, ప్రశాంత్, హరిత, విజయ్ రెడ్డి, మాసెట్టి అనిల్, కిరణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal