తెలుగు పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు

0
492

​మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్):

మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దొరవారివేంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ప్రధానోపాధ్యాయులు సువర్ణపాక కృష్ణ అన్నారు. శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ..... మాతృభాషలో విద్యాభ్యాసం చేయడం వల్ల సృజనాత్మకత పెరుగుతుందని, తెలుగు భాషా గొప్పతనాన్ని చాటిచెప్పారు.

​"మన సంస్కృతికి, మూలాలకు ప్రాణం పోసేది మన మాతృభాష మాత్రమే. ఇలాంటి పోటీలు పిల్లల్లో భాషా పటిమను పెంచుతాయి."విద్యార్థులలో తెలుగు భాషపై మక్కువ పెంచేందుకు "తెలుగు పద్యాల పోటీలు" నిర్వహించారు. విద్యార్థులు శతక పద్యాలను అనర్గళంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణా రెడ్డి, భారతి, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కానిస్టేబుల్ మృతి: రూ 1 లక్ష సాయం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.
అన్నమయ్య జిల్లాలోని టి. సుండుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46)...
By Pagadala Venkateswar 2026-07-08 11:20:52 0 106
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్...
By Kothuru Murali 2026-02-06 09:40:56 0 178
Andhra Pradesh
​లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-03-08 04:50:01 0 182
Andhra Pradesh
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కడుపులో గడ్డను బిడ్డ అని తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ చేసిన ప్రభుత్వ డాక్టర్లు
*గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కడపులో గడ్డను ... బిడ్డ అని చెబుతూ 9 నెలలుగా ప్రభుత్వ డాక్టర్లు...
By Rajini Kumari 2026-03-12 13:32:39 0 231
Andhra Pradesh
రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను...
By Boiena Rajesh 2026-03-24 11:24:00 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com