Make work with creative ideas
  • 4 Posts
  • 3 Photos
  • 0 Videos
  • Reportar at Shankar pally
  • Studied Sri vivekananda at Sri vivekananda
    Class of Diploma
  • Followed by 4 people
Basic Info
  • Experience
    5 years
  • Language
    Hindi , Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావు


    శంకర్‌పల్లి, ఏప్రిల్ 21


    దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.

    శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.

    1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.

    ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

    ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

    మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావుశంకర్‌పల్లి, ఏప్రిల్ 21 దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 294 Views 0 Reviews
  • చందిప్ప గ్రామ రైతుకు ఉత్తమ రైతు అవార్డు
    శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ సిల్క్ బోర్డు ఉత్తమ రైతు అవార్డు లభించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎంపికైన ముగ్గురు రైతుల్లో ఒకరుగా నిలిచిన శేఖర్ రెడ్డి గారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గత తొమ్మిది సంవత్సరాలుగా పట్టు పురుగుల పెంపకం (సెరికల్చర్) రంగంలో నిరంతర కృషి చేస్తూ, సొంతంగా చాకి నిర్వహిస్తూ మంచి...
    Like
    1
    0 Comments 0 Shares 258 Views 0 Reviews
  • Warm Welcome to Gaddam Vikarm !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Warm Welcome to Gaddam Vikarm ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz
    0 Comments 0 Shares 223 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com