I love my job
-
199 Posts
-
207 Photos
-
3 Videos
-
Reporter at Siricilla
-
Studied సిరిసిల at ZpssClass of 10th
-
Followed by 6 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Telangana -
Constituency
Siricilla -
District
సిరిసిల్ల -
Mandal | Tahasil | Sub Division
Siricilla
Recent Updates
-
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్వహించిన మహంకాళి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు హాజరై భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి శ్రీ రెడ్డబోయిన గోపి గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ మహోత్సవంలో పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ వంతడుపుల సుధాకర్ పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్,కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది.ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్వహించిన మహంకాళి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు హాజరై భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి శ్రీ రెడ్డబోయిన గోపి గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మహోత్సవంలో పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ వంతడుపుల సుధాకర్ పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్,కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది.0 Comments 0 Shares 128 Views 0 ReviewsPlease log in to like, share and comment! -
సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు.
జిల్లా నుంచి వివిధ మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లా రవాణాకార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులకు దాహం తీర్చడానికై త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని సహాయక మోటార్ వాహనముల తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ కల్పన జూనియర్ అసిస్టెంట్ శ్రావణి ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారుసిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు. జిల్లా నుంచి వివిధ మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లా రవాణాకార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులకు దాహం తీర్చడానికై త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని సహాయక మోటార్ వాహనముల తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ కల్పన జూనియర్ అసిస్టెంట్ శ్రావణి ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు0 Comments 0 Shares 85 Views 0 Reviews -
డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల: కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపు
జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు.
మానసిక సమస్యలకు 'టెలీ మానస్' తోడు
మాదకద్రవ్యాలకు బానిసైన వారు లేదా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడే వారు 14416 నంబర్‌కు కాల్ చేయవచ్చు. టెలీ మానస్ (Tele MANAS) ద్వారా 24/7 ఉచిత కౌన్సెలింగ్ మరియు సహాయం అందుబాటులో ఉంటుంది.
కలెక్టర్ ఆదేశించిన ప్రధానాంశాలు:
నిరంతర నిఘా: పోలీస్, ఎక్సైజ్ మరియు అటవీ శాఖలు సమన్వయంతో గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాలి.
మెడికల్ షాపుల తనిఖీ: డ్రగ్ ఇన్ స్పెక్టర్లు ప్రతి నెలా ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను తనిఖీ చేయాలి.
అవగాహన సదస్సులు: డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖల ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పించాలి.
చికిత్స: మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలి.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మనందరం కలిసి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం!
డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల: కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు. 🧠 మానసిక సమస్యలకు 'టెలీ మానస్' తోడు మాదకద్రవ్యాలకు బానిసైన వారు లేదా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడే వారు 14416 నంబర్‌కు కాల్ చేయవచ్చు. టెలీ మానస్ (Tele MANAS) ద్వారా 24/7 ఉచిత కౌన్సెలింగ్ మరియు సహాయం అందుబాటులో ఉంటుంది. 🛡️ కలెక్టర్ ఆదేశించిన ప్రధానాంశాలు: నిరంతర నిఘా: పోలీస్, ఎక్సైజ్ మరియు అటవీ శాఖలు సమన్వయంతో గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాలి. మెడికల్ షాపుల తనిఖీ: డ్రగ్ ఇన్ స్పెక్టర్లు ప్రతి నెలా ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను తనిఖీ చేయాలి. అవగాహన సదస్సులు: డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖల ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పించాలి. చికిత్స: మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలి. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మనందరం కలిసి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం!0 Comments 0 Shares 174 Views 0 Reviews -
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చంద్రంపేటలో బిజెపి సీనియర్ నాయకులు 104వ బూత్ అధ్యక్షులు శ్రీ మారోజు హరికృష్ణ చారి గారి తండ్రిగారు పరమపదించారు నేడు వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారుఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చంద్రంపేటలో బిజెపి సీనియర్ నాయకులు 104వ బూత్ అధ్యక్షులు శ్రీ మారోజు హరికృష్ణ చారి గారి తండ్రిగారు పరమపదించారు నేడు వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు0 Comments 0 Shares 117 Views 0 Reviews
-
రాజన్న సిరిసిల్ల లో చైన్ దొంగలు అరెస్ట్ వివరాలు వెల్లడించిన : సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్.
ఈసందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు... తేదీ 17-03-2026 రోజు రాత్రి సమయంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయినగర్ లో మేర్గు లత తన ఇంటి వద్ద గేటు బయటకు రాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ మెడలోగల బంగారు పుస్తెలు బలవంతంగా తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోగా,మేర్గు లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందుతులను సయ్యద్ మౌలాన, మంగురు ప్రకాష్ యాదవ్ లుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందుతుల సిరిసిల్ల కు వస్తున్నరన్న సమాచారం మేరకు రడుగు చౌరస్తా వద్ద నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను రిమాండుకి ఈరోజు పంపించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,గ్రామాలలో,పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరినారు.
*నిందితుల వివరాలు:*
*A1. సయ్యద్ మౌలాన తండ్రి: బడే సాబ్, వయస్సు: 22 సం లు. r/o తుర్కశినగర్ కొడిమ్యాల, మండల జగిత్యాల జిల్లా.*
*A2. మంగురు ప్రకాష్ యాదవ్, తండ్రి: ధర్మేందర్, వయస్సు: 19 సం లు. r/o వేదిరే గ్రామం, రామడుగు మండల, కరీంనగర్ జిల్లా.
రాజన్న సిరిసిల్ల లో చైన్ దొంగలు అరెస్ట్ వివరాలు వెల్లడించిన : సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈసందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు... తేదీ 17-03-2026 రోజు రాత్రి సమయంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయినగర్ లో మేర్గు లత తన ఇంటి వద్ద గేటు బయటకు రాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ మెడలోగల బంగారు పుస్తెలు బలవంతంగా తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోగా,మేర్గు లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందుతులను సయ్యద్ మౌలాన, మంగురు ప్రకాష్ యాదవ్ లుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందుతుల సిరిసిల్ల కు వస్తున్నరన్న సమాచారం మేరకు రడుగు చౌరస్తా వద్ద నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను రిమాండుకి ఈరోజు పంపించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,గ్రామాలలో,పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరినారు. *నిందితుల వివరాలు:* *A1. సయ్యద్ మౌలాన తండ్రి: బడే సాబ్, వయస్సు: 22 సం లు. r/o తుర్కశినగర్ కొడిమ్యాల, మండల జగిత్యాల జిల్లా.* *A2. మంగురు ప్రకాష్ యాదవ్, తండ్రి: ధర్మేందర్, వయస్సు: 19 సం లు. r/o వేదిరే గ్రామం, రామడుగు మండల, కరీంనగర్ జిల్లా.0 Comments 0 Shares 214 Views 0 Reviews -
రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి ల కల రాజన్న సిరిసిల్ల జిల్లా లో కలెక్టర్ చౌరస్తా లో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మశాలి ల చేనేత కండె (జోటా )రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి ల కల రాజన్న సిరిసిల్ల జిల్లా లో కలెక్టర్ చౌరస్తా లో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మశాలి ల చేనేత కండె (జోటా )1 Comments 0 Shares 1K Views 0 Reviews1
-
రాజన్న సిరిసిల్ల లో బీజేపీ ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చెపట్టారు.
రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హామీల అమలు అంశం వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
రెండున్నర సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ప్రధాన హామీలు, అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యార్థి భృతి, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తోందని విమర్శించారు.
మహిళలకు ప్రకటించిన కల్యాణ లక్ష్మీ, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ స్పష్టం చేసింది.
ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా మోర్చా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారురాజన్న సిరిసిల్ల లో బీజేపీ ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చెపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హామీల అమలు అంశం వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. రెండున్నర సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ప్రధాన హామీలు, అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యార్థి భృతి, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తోందని విమర్శించారు. మహిళలకు ప్రకటించిన కల్యాణ లక్ష్మీ, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా మోర్చా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు0 Comments 0 Shares 193 Views 0 Reviews -
కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆడెపు చంద్రకళ..
రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆడెపు చంద్రకళ ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నియామక పత్రాన్ని 23వ వార్డ్ కౌన్సిలర్ ఆడెపు చంద్రకళకు అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. అనంతరం ఆడెపు చంద్రకళ మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, 14వ వార్డు కౌన్సిలర్ వెంగళ లీల లక్ష్మీనర్సు, 22వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, 32వ వార్డు కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం, 4 వ వార్డు కౌన్సిలర్ లయక్ సుల్తానా, జిల్ల ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, మాజీ కౌన్సిలర్ ఆడెపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆడెపు చంద్రకళ.. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆడెపు చంద్రకళ ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నియామక పత్రాన్ని 23వ వార్డ్ కౌన్సిలర్ ఆడెపు చంద్రకళకు అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. అనంతరం ఆడెపు చంద్రకళ మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, 14వ వార్డు కౌన్సిలర్ వెంగళ లీల లక్ష్మీనర్సు, 22వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, 32వ వార్డు కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం, 4 వ వార్డు కౌన్సిలర్ లయక్ సుల్తానా, జిల్ల ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, మాజీ కౌన్సిలర్ ఆడెపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 183 Views 0 Reviews -
రాజన్న సిరిసిల్ల మున్సిపల్ ను ముంచుతున్నారు..!
ఆదాయ వనరులను మింగేస్తున్నారు..
వసూలు ఫుల్.. ఆదాయం నిల్..
కాంట్రాక్టు ఉద్యోగి అక్రమ వసూళ్ళు
అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట ఎలా..?
పాలకవర్గానికి పట్టింపు లేని వైనం..
నివాసగృహాలన్నీ (రెసిడెన్షియల్) వ్యాపార సముదాయాలుగా (కమర్షియల్) మారినా ఇంటి పన్ను పెరగదు
ఓ హాస్పిటల్ ను నిర్వహిస్తున్న బిల్డింగుకు కేవలం 2823 రూపాయలు (రెసిడెన్షియల్) ఇంటి పన్ను
ఓ బేకరీ యజమాని వద్ద లైసెన్సులు ఇతర అనుమతులు లేవని సుమారు 40 వేలు వసూలు చేసిన మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి
రాజన్న సిరిసిల్ల మున్సిపల్ ను ముంచుతున్నారు..! ఆదాయ వనరులను మింగేస్తున్నారు.. వసూలు ఫుల్.. ఆదాయం నిల్.. కాంట్రాక్టు ఉద్యోగి అక్రమ వసూళ్ళు అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట ఎలా..? పాలకవర్గానికి పట్టింపు లేని వైనం.. నివాసగృహాలన్నీ (రెసిడెన్షియల్) వ్యాపార సముదాయాలుగా (కమర్షియల్) మారినా ఇంటి పన్ను పెరగదు ఓ హాస్పిటల్ ను నిర్వహిస్తున్న బిల్డింగుకు కేవలం 2823 రూపాయలు (రెసిడెన్షియల్) ఇంటి పన్ను ఓ బేకరీ యజమాని వద్ద లైసెన్సులు ఇతర అనుమతులు లేవని సుమారు 40 వేలు వసూలు చేసిన మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి0 Comments 0 Shares 151 Views 0 Reviews -
సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.
సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
#Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_districtసిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. #Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district0 Comments 0 Shares 429 Views 0 Reviews -
జన సైనికులకు, వీర మహిళలకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము.
కరీంనగర్ ఇంచార్జ్ ఆర్కే సాగర్ గారి మార్గదర్శకత్వంలో మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ మహేష్ పెంటల గారి ఆధ్వర్యంలో, రేపు అనగా 14-03-2026 తేదీన జనసేన పార్టీ నాయకుల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
కావున రేపు శనివారం ఉదయం 9 గంటలకు మహంకాళి టెంపుల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి వేములవాడలో ఉన్న జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు అందరూ విచ్చేసి జనసేన పార్టీ ఆవిర్భావ పండుగను జయప్రదం చేయవలసిందిగా మనవి.
ఇట్లు
మేడిశెట్టి రోహిత్
వేములవాడ నియోజకవర్గంజన సైనికులకు, వీర మహిళలకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. కరీంనగర్ ఇంచార్జ్ ఆర్కే సాగర్ గారి మార్గదర్శకత్వంలో మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ మహేష్ పెంటల గారి ఆధ్వర్యంలో, రేపు అనగా 14-03-2026 తేదీన జనసేన పార్టీ నాయకుల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున రేపు శనివారం ఉదయం 9 గంటలకు మహంకాళి టెంపుల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి వేములవాడలో ఉన్న జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు అందరూ విచ్చేసి జనసేన పార్టీ ఆవిర్భావ పండుగను జయప్రదం చేయవలసిందిగా మనవి. ఇట్లు మేడిశెట్టి రోహిత్ వేములవాడ నియోజకవర్గం0 Comments 0 Shares 184 Views 0 Reviews -
బిఆర్ఎస్ పార్టీ లో చేరిన యువ నాయకుడు లింగాల సందీప్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు లింగాల సందీప్ సోమవారం రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు,బిఆర్ఎస్ పార్టీ లో చేరిన యువ నాయకుడు లింగాల సందీప్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు లింగాల సందీప్ సోమవారం రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు,0 Comments 0 Shares 87 Views 0 Reviews -
సిరిసిల్ల జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం.
సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతి అంతస్తులు ప్రత్యేకంగా వాష్ రూమ్ లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్తోపాటు టెన్ ప్లస్ టు నిర్మాణ శైలితో రాబోయే రెండేళ్లలో పూర్తిస్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
#Sircilla #Sircillanewcourt #sircillanews #rajannasircilla #sircilla_rajanna_districtసిరిసిల్ల జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతి అంతస్తులు ప్రత్యేకంగా వాష్ రూమ్ లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్తోపాటు టెన్ ప్లస్ టు నిర్మాణ శైలితో రాబోయే రెండేళ్లలో పూర్తిస్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. #Sircilla #Sircillanewcourt #sircillanews #rajannasircilla #sircilla_rajanna_district0 Comments 0 Shares 509 Views 0 Reviews -
ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్.
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.
పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
#Sircilla #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_districtఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. #Sircilla #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district0 Comments 0 Shares 458 Views 0 Reviews -
రాజన్న సిరిసిల్ల జిల్లా..
1.సిరిసిల్ల పట్టణ సీఐ గా నెమ్మని శ్రీనివాస్....
2.జిల్లా డీసీఆర్బి లో ఉన్న కదిర నాగేశ్వరరావును సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ..
3.సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మొగిలిని డిసిఆర్బికి బదిలీ..
4.కరీంనగర్ పీసీఆర్ లో పని చేస్తున్న ఓదెల వెంకటేశ్ ను ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నియామకం...
#sircillanews #rajannasircillaupdates #rajannasircilla #rajannasircillapolice #policeరాజన్న సిరిసిల్ల జిల్లా.. 1.సిరిసిల్ల పట్టణ సీఐ గా నెమ్మని శ్రీనివాస్.... 2.జిల్లా డీసీఆర్బి లో ఉన్న కదిర నాగేశ్వరరావును సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ.. 3.సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మొగిలిని డిసిఆర్బికి బదిలీ.. 4.కరీంనగర్ పీసీఆర్ లో పని చేస్తున్న ఓదెల వెంకటేశ్ ను ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నియామకం... #sircillanews #rajannasircillaupdates #rajannasircilla #rajannasircillapolice #police0 Comments 0 Shares 561 Views 0 Reviews -
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గృహ యజమానులు మరియు వాణిజ్య గృహ యజమానులకు తెలియజేయునది ఏమనగా, ఆస్తి పన్ను (Property Tax), ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వివిధ లైసెన్స్ ఫీజులు మరియు ప్రకటనల (Advertisements) ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు.
పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పన్నుల ద్వారా లభించే ఆదాయంతోనే నిర్వహించబడుతున్నాయి. అందువల్ల ప్రతి పన్నుదారుడు తన బాధ్యతగా భావించి బకాయిలు లేకుండా తక్షణమే చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది.
ప్రస్తుతం పురపాలక సిబ్బంది మొత్తం పన్నుల వసూళ్లలో నిమగ్నమై, ఇంటింటి సేకరణ, ఫీల్డ్ సందర్శనలు నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. పట్టణ ప్రజలు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించగలరని ఆశిస్తున్నామని కమిషనర్ గారు తెలిపారు.సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గృహ యజమానులు మరియు వాణిజ్య గృహ యజమానులకు తెలియజేయునది ఏమనగా, ఆస్తి పన్ను (Property Tax), ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వివిధ లైసెన్స్ ఫీజులు మరియు ప్రకటనల (Advertisements) ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పన్నుల ద్వారా లభించే ఆదాయంతోనే నిర్వహించబడుతున్నాయి. అందువల్ల ప్రతి పన్నుదారుడు తన బాధ్యతగా భావించి బకాయిలు లేకుండా తక్షణమే చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది. ప్రస్తుతం పురపాలక సిబ్బంది మొత్తం పన్నుల వసూళ్లలో నిమగ్నమై, ఇంటింటి సేకరణ, ఫీల్డ్ సందర్శనలు నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. పట్టణ ప్రజలు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించగలరని ఆశిస్తున్నామని కమిషనర్ గారు తెలిపారు.0 Comments 0 Shares 205 Views 0 Reviews -
ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు.వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు.వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.0 Comments 0 Shares 125 Views 0 Reviews -
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు”
ఈ సందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ.. తేది 27-02-2026 శుక్రవారం రోజున అర్దరాత్రి సమయంలో బి.వై.నగర్ లో గల జెండా గద్దేవద్ద ఆకునూరి కళ్యాణ్ తండ్రి మోహన్, 26 సం. లు, ఎస్సి మాదిగ, అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అనునతడి పై తన స్నేహితులు గొడవపడి కళ్యాణ్ ని కులం పేరుతో తిట్టుతూ ఇష్టం వచ్చినట్లు చేతులతో కొట్టి కాళ్ళతో తన్నుతూ బండ రాళ్ళతో విచక్షణ రహితంగా కొట్టి హత్యాప్రయత్నం చేసినారని, తన తల్లి ఆకునూరి పద్మ పిర్యాదు మేరకు అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ తెలిపినారు. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరి పై కఠిన చర్యలు తీసుకోబడతాయని, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు” ఈ సందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ.. తేది 27-02-2026 శుక్రవారం రోజున అర్దరాత్రి సమయంలో బి.వై.నగర్ లో గల జెండా గద్దేవద్ద ఆకునూరి కళ్యాణ్ తండ్రి మోహన్, 26 సం. లు, ఎస్సి మాదిగ, అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అనునతడి పై తన స్నేహితులు గొడవపడి కళ్యాణ్ ని కులం పేరుతో తిట్టుతూ ఇష్టం వచ్చినట్లు చేతులతో కొట్టి కాళ్ళతో తన్నుతూ బండ రాళ్ళతో విచక్షణ రహితంగా కొట్టి హత్యాప్రయత్నం చేసినారని, తన తల్లి ఆకునూరి పద్మ పిర్యాదు మేరకు అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ తెలిపినారు. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరి పై కఠిన చర్యలు తీసుకోబడతాయని, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.0 Comments 0 Shares 107 Views 0 Reviews
More Stories