రాజన్న సిరిసిల్ల లో బీజేపీ ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చెపట్టారు.

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హామీల అమలు అంశం వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

రెండున్నర సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ప్రధాన హామీలు, అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యార్థి భృతి, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తోందని విమర్శించారు.

మహిళలకు ప్రకటించిన కల్యాణ లక్ష్మీ, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ స్పష్టం చేసింది.

ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా మోర్చా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల లో బీజేపీ ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చెపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హామీల అమలు అంశం వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. రెండున్నర సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ప్రధాన హామీలు, అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యార్థి భృతి, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తోందని విమర్శించారు. మహిళలకు ప్రకటించిన కల్యాణ లక్ష్మీ, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా మోర్చా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
0 Comments 0 Shares 192 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com